Road Accident | సదాశివపేట, జూన్ 6 : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం సైదాపూర్ తండాకు చెందిన అభిషేక్ (13), సాయికిరణ్ (22)లు సదాశివపేట వైపు నుంచి ఆటోలో మామిడి పండ్లను తీసుకెళ్తున్నారు. కంబాలపల్లి చౌరస్తా వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.