నిజాంసాగర్, మార్చి 19: మహ్మద్‌నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు గ్రామంలోని తాగునీటి ట్యాంకుపైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. 60 అడుగుల ఎత్తు ఉన్న ట్యాంకు పైకి ఎక్కారు. విషయం తెలుసుకొని విద్యార్థినిని సముదాయించారు. ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, సురక్షితంగా కిందకు దించారు. సబ్ కలెక్టర్ ట్యాంకుపైకి ఎక్కి బాలికను కాపాడడంతో స్థానికులు అభినందించారు.