Tholi Ekadashi | గుమ్మడిదల, జూలై 6 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ రామ చంద్రస్వామి దేవాలయంలో లక్ష తులసీ దళాలతో అర్చనను వైభవంగా నిర్వహించారు. ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీదేవి భూదేవి మేత కల్యాణ రామచంద్రస్వామి దేవాలయంలోని ఆలయ వంశ పారంపర్యకులు కేవీ నర్సింహాచార్యులు, కేవీ రంగనాథచార్యులు, అచ్చుతాచార్యుల ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా లక్ష తులసి దళాలతో అర్చనలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులు కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్రెడ్డి, ధర్మకర్తలు, మున్సిపాలిటీ భక్తులు పాల్గొన్నారు.
నేత్ర పర్వంగా తొలి ఏకాదశి..
తొగుట : తొలి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేట వేణుగోపాల స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.. ఆలయ కమిటీ చైర్మన్ రాయరావు అరుణ~రఘుపతి రావు, ఆలయ అర్చకులు రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో ఆలయం లో శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అర్చన, తులసి అభిషేకం, ప్రత్యేక పూజాది కార్యక్రమం లు నిర్వహించారు. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములో తొలి ఏకాదశి సందర్భముగా సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలుపుకుంటూ గ్రామము దిన దిన అభివృద్ధిచెందాలని మన వేణుగోపాల్ స్వామి కృపా కటాక్షాలు అందరిమీదా ఉండాలని స్వామి వారి మంగళ శాసనములు తెలియజేశారు.
తొలి ఏకాదశి సందర్బంగా గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రజలు భక్తి శ్రద్దలతో శాఖాహారం తీసుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు..తొగుట ఏ ఎస్ ఐ జీడిపల్లి రాంరెడ్డి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు..అలాగే గ్రామంలోని దళిత గోవిందం వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు