హత్నూర, నవంబర్ 18 : ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హత్నూర పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ర్టానికి చెందిన హరిశ్చంద్ర సరేన్(21) గత రెండేళ్లక్రితం బతుకుదెరువుకోసం బోర్పట్ల గ్రామానికివచ్చాడు.
బుధవారం రాత్రి గ్రామంలోని జగదేవ్ పంతులు ఇంటిపై కూర్చొని మద్యం సేవిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.