న్యాల్కల్, మే 9 : బతుకు దేరువుకోసం పుస్తకాలను అమ్ముకునేందుకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వ్యాపారి మృతి చెందినట్టు హద్నూర్ ఏఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఏఎస్ఐ కథనం ప్రకారం..హైదరాబాద్లోని కుషాయిగూడకు చెందిన గుడిమట్ల శాంతకుమార్(55) ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం పులిగుంత సమీపంలోని చర్చి అవరణలో ఆశీర్వాద సభలో పుస్తకాలను అమ్ముకునేందుకు వచ్చాడన్నారు.
పుస్తకాలను అమ్ముకునే సమయంలో రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో నిర్వాహకులు హుటాహుటిన దవఖానకు తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మృతి చెందాడు. సోమవారం మృతుడి భార్య పద్మజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ పేర్కొన్నారు.