Overloaded Vehicles | హత్నూర, జూలై 14 : సామర్థ్యానికి మించి అధిక లోడ్‌తో వాహనాలు రోడ్డుపై వెళ్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తారు రోడ్లు సైతం ధ్వంసమవుతున్నాయి. ముఖ్యంగా టిప్పర్లల్లో కంకర, డస్ట్‌ను వాహన సామర్థ్యానికి మించి లోడ్‌చేసి తరలిస్తుండటంతో తారు రోడ్లు గుంతలు పడి చెడిపోతున్నాయి.
కంకర, డస్ట్ తరలించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో వాహనం వెనకాల వచ్చే ద్విచక్ర వాహనదారుల కళ్లల్లో డస్ట్ పడి కిందపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ల వద్ద కంకర కుప్పలు కుప్పలుగా పడి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
రవాణా ఖర్చులు తగ్గించుకొని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కంకర, డస్ట్ చేరవేయాలన్న దురాశతో వాహన సామర్థ్యానికి మించి తరలిస్తుండటంతో నిత్యం ఏదో ఒకచోట ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధికలోడ్‌తో వెలుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని