Sports Schools | సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 11 : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ క్రీడా పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిందని జిల్లా యువజన క్రీడల అధికారి ఖాసీం బేగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ హకీంపేటలో బాలురకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు, కరీంనగర్లో బాలురకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు, ఆదిలాబాద్లో బాలురకు 20 సీట్లు, బాలికలకు 20 సీట్లు, మొత్తం 120 సీట్లు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు.
ఈ నెల 16 నుంచి 19వరకు మండల స్థాయిలో, ఈ నెల 25, 26వ తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేధ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. జూలై 3,4వ తేదీలలో హకీంపేటలోని క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించి బాలురు 20 మంది, బాలికలు 20 మందిని ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అయితే 4వ తరగతి ప్రవేశాల కోసం 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31లోపు విద్యార్థులు జన్మించి ఉండాలన్నారు.
సంబంధిత ధృవపత్రాలతో ఎంపిక పోటీలకు హాజరు కావాలని కోరారు. రిజిష్ట్రేషన్ కోసం tqss.telangana.gov.in లో వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7981798957 నెంబర్లో సంప్రదించాలన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు