Telangana Formation Day | గుమ్మడిదల, జూన్ 2 : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గుమ్మడిదల మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, ఆయాగ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు జాతీయ జెండాలను ఆవిష్కరించి అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రఘు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఉమారాణి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్సై భరత్ భూషన్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎంఏవోడీ. శ్రీనివాస్‌రావుతోపాటు పలు కార్యాలయాలో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..
రాయికోడ్ జూన్ 2 : రాయికోడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవిర్బావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సోమవారం మండల కేంద్రమైన తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్,ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఎంఎం శరీష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయకుమార్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నారాయణ,అంగన్వాడీ కేంద్రం వద్ద అంగన్వాడీ టీచర్ కె. సక్కుబాయి,ఎంఈవో కార్యాలయం వద్ద ఎంఈవో మాణయ్య,ఎఎంసీ కార్యాలయం వద్ద ఎఎంసీ చైర్మన్ సుధాకర్‌రెడ్డిలు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ సమావేశాలలో పలువురు నాయకులు మాజీ ఎంపీపీ కో-ఆప్షన్ మెంబర్ అబెదాలి, సంగమేశ్వర్, సతీష్ పంతులు, తుకారం, కేదారినాథ్ పాటిల్‌లు ఉన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి