వారం రోజుల్లో ఊపందుకోనున్న వరికోతలుసంగారెడ్డి(నమస్తే తెలంగాణ)/ మెదక్, ఏప్రిల్ 27 : యాసంగిలో రైతులు పండించిన మొత్తం ధాన్యం సేకరించడమే లక్ష్యంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రా లు ప్రారంభమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి రైతులకు మొండిచేయి చూపించింది. ధాన్యం కొనుగోలు చేస్తామన్న కేంద్రం, ఆ తర్వాత చేతులు ఎత్తేసింది. యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ దీక్షకు కూర్చున్నారు. అయినా కేంద్రంలోని మోదీ ప్రభు త్వం రైతులపై కనికరం చూపించలేదు. రైతాంగాన్ని కంటిపాపలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్, రైతుల కోసం ధాన్యం సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.4700 కోట్ల అదనపు భారం పడుతుంది. అయినా రైతుల కోసం సీఎం కేసీఆర్ ధా న్యం కొనుగోలు చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధికారులు ధాన్యం కొనుగోళ్లు చేపడుతుండగా, ఇప్పుడిప్పుడే ధాన్యం కేంద్రాలకు వస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 35,256 ఎకరాల వరి సాగైంది. 84,614 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు అవసరాలకు ధాన్యం ఉంచుకోగా, 75,000 మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. దీనికి గాను జిల్లాలో మొత్తం 155 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణ యం తీసుకున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 77, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 63, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు 15 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. బోర్పట్ల, సిక్లింద్లాపూర్, బ్రాహ్మణగూ డ, కొన్యాల, హత్నూర, బాచేపల్లి, మాసాన్‌పల్లి, మార్ధి, గుమ్మడిదల, నల్లవల్లి, సోలక్పల్లి, పటాన్చెరు, ముత్తంగి, తెల్లాపూర్, రుద్రారం, జిన్నారం, ఊట్ల, వాయిలాల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో 26, అందోలులో 22, కల్హేర్‌లో 21, పుల్కల్లో 19, నారాయణఖేడ్‌లో 17, సిర్గాపూర్‌లో 10, చౌటకూరులో 6, గుమ్మడిదలలో 5, జిన్నారంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు మండలంలో 4, కొండాపూర్‌లో 4, సంగారెడ్డి లో 4, కంగ్గిలో 3, వట్పల్లిలో 3, సదాశివపేటలో 2, రామచంద్రాపురంలో 1 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. వరి కోతలు ఇంకా ఊపందుకోలేదు… వారం రోజుల్లో ఊపందుకోనున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకుని తేవాలని అధికారులు సూచిస్తున్నారు. వరి సాగు చేసిన రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలి, లేకుంటే మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరణ తప్పనిసరి. కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ యంత్రా లు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు అధికారులు సిద్ధంగా ఉంచా రు. 21 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం 18 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. 4,300 టా ర్పాలిన్లు అవసరం కాగా, 4వేలు సిద్ధ్దంగా ఉంచారు. 155 ప్యాడీ క్లీనర్లు, 155 తేమ కొలిచే యంత్రాలు, 155 తూకం యంత్రాలు అందుబాటులో సిద్ధంగా ఉన్నాయి.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో యాసంగిలో 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వ స్తుందని అధికారులు అంచనా. జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పీఏసీఎస్ ఆధ్వర్యం లో 233, ఐకేపీ ద్వారా 102, డీసీఎంఎస్ 2, ఏఎంసీ 3, ఎఫ్‌పీవో ద్వారా ఒకటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 80 కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం తరలింపునకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ 750 లారీలు సమకూరుస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరించిన వెంటనే లారీల్లో లోడ్ చేసి మిల్లులకు పంపుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు అనుగుణంగా గన్నీ సంచులు, ట్యాబ్స్, టార్పాలిన్లు, కాంటాలు, లారీలను సమకూర్చనున్నారు. కోటి 20 లక్షల గన్నీ బస్తాలు అవసరం ఉండగా, ఇ ప్పటికే 50 లక్షల గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచారు. మిగిలిన 70 లక్షల బ్యాగులు రావాల్సి ఉంది.కొనుగోలు కేంద్రాలను ఎఫ్‌సీఐ టీం పరిశీలించనుంది. ధాన్యంలో తేమ 17శాతానికి మించకుండా, చెత్తాచెదారం లేకుండా చూడాలని రైతులకు సూచిస్తున్నారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ పాస్బుక్కు, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఇన్చార్జిలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ-గ్రేడ్ రకానికి రూ.1960, సాధారణ రకానికి రూ.1940 మద్దతుధరగా ప్రభుత్వం ధర నిర్ణయించింది.
మూడు రోజుల్లో డబ్బులు జమ
మెదక్ జిల్లాలో ఇప్పటికే 80 కొనుగో లు కేంద్రాలను ప్రారంభించాం. మిగతా వి మరో రెండు, మూడు రోజుల్లో ప్రా రంభిస్తాం. రైతులకు ఇబ్బదులు తలెత్తకుండా గన్నీ సంచులు, లారీలు అందుబాటులో ఉంచు తాం. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధా న్యం తీసుకురావాలి. యాసంగిలో 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. విక్రయించిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమకానున్నాయి.
– రమేశ్, అదనపు కలెక్టర్ మెదక్
చివరి గింజా కొనుగోలు చేస్తాం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో యాసంగి లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేసి, సే కరణకు జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తు న్నాం. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. గన్నీబ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాము. జిల్లాలోని 63 రైస్ మిల్లులకు సేకరించిన ధాన్యం సకాలంలో చేరవేసేలా ఏర్పాట్లు చేపట్టాం.
– వీరారెడ్డి, అదనపు కలెక్టర్ సంగారెడ్డి