ఐటీఐలోని సమస్యలను పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే గూడెం
ఎమ్మెల్యే గూడెం | ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సందర్శించారు.

రామచంద్రాపురం, నవంబర్3 : ఐటీఐలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆర్సీపురం డివిజన్లోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సందర్శించారు. అనంతరం ఐటీఐలో ఉన్న సమస్యలను ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రావు ఎమ్మెల్యేకు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐటీఐ సమస్యలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధునాతన సౌకర్యాలతో ఐటీఐని అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీఐలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించేలా జాబ్ మేళాను నిర్వహిస్తామన్నారు.
ఐటీఐలో చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయని, పూర్తిస్థాయిలో ఐటీఐని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, వర్కింగ్ అధ్యక్షుడు ఐలేశ్, ప్రధానకార్యదర్శి బేకు యాదయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు బూరుగడ్డ నగేశ్, అన్వర్, భాస్కర్, అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

