కొండాపూర్, జూన్ 26: కొండాపూర్ (Kondapur) సీఐగా సుమన్ కుమార్, ఎస్ఐగా సోమేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. కొండాపూర్ సీఐగా విధులు నిర్వహించిన వెంకటేశం సదాశివపేట సీఐగా బదిలిపై వెళ్లారు. అలాగే ఇప్పటి వరకు కొండాపూర్లో ఎస్ఐగా పనిచేసిన భరత్ కుమార్ రెడ్డి వికారాబాద్ జిల్లా చన్గొమ్ముల్ పోలీస్ ష్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో కొండాపూర్ ఎస్ఐగా సోమేశ్వరి సంగారెడ్డి జిల్లా అమిన్పూర్ పీఎస్ నుంచి బదిలిపై వచ్చారు.
ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ ఫిర్యాదుదారులు ఎవరైనా నేరుగా పోలీస్ ష్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే మండలంలోని ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలని, గాంజా, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గ్రామంలో ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. చట్టని ఎవ్వరు చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.