మునిపల్లి, అక్టోబర్ 01: మా గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్లు (Reservations) ఎప్పుడూ రావా.. అసలు వస్తాయా లేదా అని మండలంలోని బుదేరా, ఖమ్మంపల్లి, బోడపల్లి, పెద్దాలోడి గ్రామాల్లోని దళితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో ఈ గ్రామాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్లు రాకపోవడం గమనార్హం. ఏ లెక్కలు చూసి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్లు కల్పించడం లేదని అధికారుల తిరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు. తాము ఈ గ్రామాల్లో పుట్టడమే శాపమా అంటూ ఆవేదన వ్యక్తము చెస్తున్నారు. రాజకీయలకు, సర్పంచ్ పదవులకు దళితులు అర్హులు కారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మా పల్లె ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎస్సీ రిజర్వేషన్ వరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకునే వారు ఎవరూ లేరా అని వాపోతున్నారు.
మునిపల్లి మండలంలోని బుదేరా, పెద్దలోడి, ఖమ్మంపల్లి, పెద్దలోడి గ్రామల్లో ఒక్కసారైనా ఎస్సీ రిజర్వేషన్ రాలేదు. ఈ నాలుగు గ్రామల్లో మంత్రి దామోదర రాజనార్సిహ ప్రత్యేక చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో సర్వే జరిపించి తాగు చర్యలు తీసుకోవాలని దళితులు వేడుకుంటున్నారు.
ఈ గ్రామాల్లో పుట్టడమే మేము చేసిన తప్పా. మా గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదని ఖమ్మంపల్లికి చెందిన తుడుము సుభాష్ అన్నారు. రాజకీయాల్లో ముందుకు రావాలని మాకు ఎంతో ఆశగా ఉంది. అయితే గ్రామాల్లో ఒక్కసారైనా దళితులకు అనుకూలమైన రిజర్వేషన్లు రాకపోవడంతో రాజకీయం అంటేనే నిరాశకు గురవుతున్నాం. మా గ్రామంలో సర్పంచ్ పోటీలో పాల్గొనే అవకాశం లేదా.. అసలు మా ఊరిలో దళితులు రాజకీయం చేసేందుకు ఆర్హులు కారా?. గ్రామాల్లో రాజకీయం చేయాలని ఎంతో ఆశ వున్నప్పటికి రిజర్వేషన్ సహకరించకపోవడంతో ఏం చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బుదేరా గ్రామంలో రాజకీయం చేయడం అంటే చాలా ఇష్టమని బుదేరాకు చెందిన గడ్డం రాజు అన్నారు. గ్రామంలో రాజకీయం చేయాలని ఏంతో ఆశ ఉన్నప్పటికీ రిజర్వేషన్ సహకరించడం లేదు. నేడు గ్రామల్లో రాజకీయ పార్టీలో చురుగ్గా ఉండి రిజర్వేషన్లు వస్తేనే తగిన గుర్తింపు వస్తుంది. అనుకూలమైన రిజర్వేషన్లు లేకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మా గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రాకపోదు, ఎన్నికల్లో పోటీ చేయాలేకపోతమా అన్న ఆశతో ఎదురు చూసిన ప్రతిసారీ నిరాశే మిగులుతుంది.
పెద్దలోడి….
ఖమ్మంపల్లిలో
బోడపల్లి..
బుదేరా..