Dr BR Ambedkar | మునిపల్లి, డిసెంబర్ 22; అంబేద్కర్ అందరివాడు… కొందరివాడు కాదని అల్లాపూర్ సర్పంచ్ నారాయణ అన్నారు. ప్రతి ఇంట్లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ జీవిత చరిత్రను చిన్నారులకు తెలియజేయాలన్నారు. సోమవారం మునిపల్లి మండలంలోని అల్లాపూర్ గ్రామ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ నారాయణ ఇంటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు సర్పంచ్ నారాయణతో పాటు నూతనంగా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్స్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటంతో ర్యాలీగా వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల తోనే నేడు సర్పంచ్ గా గెలిచినట్టు తెలిపారు. ప్రతీ ఇంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. త్వరలో అల్లాపూర్ గ్రామంలో ఇంటింటికి అంబేద్కర్ చిత్రపటాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Thungathurthy : మీ ఇంటి సేవకుడిగా బాధ్యత తీసుకుంటా : తప్పెట్ల ఎల్లయ్య
victory procession turns into blaze | విజయోత్సవ ఊరేగింపులో చెలరేగిన మంటలు.. 16 మందికి కాలిన గాయాలు