తుంగతుర్తి, డిసెంబర్ 22 : తుంగతుర్తి మండలంలోని 24 గ్రామ పంచాయతీలో సోమవారం నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని వెంపటి గ్రామ సర్పంచ్‌గా తప్పెట్ల ఎల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఒక కళాకారుడిగా ప్రజల ముందుకు వచ్చానని, ఇప్పుడు సర్పంచ్‌గా మీ ఇంటి సేవకుడిగా బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆయన చేసిన ప్రమాణ స్వీకారం అందరినీ ఆకట్టుకుంది. ఆయన పాడిన పాట వీక్షకులను కట్టిపడేసింది. ఆఖరి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన భావోద్వేగంగా ప్రకటించారు.