Ganja Seized | జహీరాబాద్, ఏప్రిల్ 30 : అక్రమంగా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం 6:00 గంటల సమయంలో సీసీఎస్ టీం చిరాగ్పల్లి ఎస్ఐ కే రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మాడ్గి టి-రోడ్డు వద్ద జాతీయ రహదారి-65 ప్రక్కన వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ వైపు నుండి కర్ణాటక వైపు అనుమానాస్పదంగా వస్తున్న ఒక టాటా ఇండిగో సీఎస్ కారు నెంబర్ AP 28 DE 3257 గల దానిని ఆపి తనిఖీ చేయగా అట్టి కారు డిక్కీలో గోధుమ రంగు కవర్ చుట్టిన 40 ఎండుగంజాయి ప్యాకెట్స్ కనిపించాయి.
కారు డ్రైవర్/ నిందితుని వివరాలు: జి.తిరుమలేష్ తండ్రి నరసింహులు, వయసు: 25 సం.లు, కులం: ముదిరాజ్, వృత్తి: ట్రాక్టర్ డ్రైవర్, నివాసం గోవింద్పూర్ గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా
బాగ్దాల్ ఉన్న వినోద్‌కు ఇవ్వడానికి వెళ్తుండగా..
వివరాల్లోకి వెళ్తే నిందితుని దూరపు బంధువైన బీదర్ నివాసుడు గుండప్ప చెప్పినట్లుగా రూ.50,000/-లకు ఆశపడిన నిందితుడు, టాటా ఇండిగో సీఎస్ కారు నంబర్ AP28DE3257లో 40-ఎండు గంజాయి ప్యాకెట్లు తీసుకొని బాగ్దాల్ ఉన్న వినోద్‌కు ఇవ్వడానికి వెళ్తుండగా.. మార్గ మధ్యలో అనగా చిరాగ్పల్లి గ్రామ శివారులో గల సహారా దాబా వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న చిరాగ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అట్టి 40 ప్యాకెట్ల ఎండుగంజాయిని తూకం వేయగా 79.75 కిలోలు ఉన్నది. దీని విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అన్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని 40-ఎండు గంజాయి ప్యాకెట్స్, నేరానికి వినియోగించిన కారు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందని, నిందితున్ని రిమాండ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసినా సంగారెడ్డి జిల్లా S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి గంజాయి అక్రమ రవాణా చేధనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం