Ganja | మునిపల్లి, అక్టోబర్ 15 : 250 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమన్, మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నుంచి బీదర్ రాష్ట్రానికి తరలిస్తుండగా.. మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని ముంబై జాతీయ రహదారిపై గల డక్కన్ టోల్ ప్లాజా వద్ద పట్టుకొని గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్బంగా పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్ణాటకవైపు వెళ్లే వాహనాలను కంకోల్ టోల్ గెట్ వద్ద వాహనాల తనిఖీలు చేపడుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వెళుతున్న వారు గంజాయి తరలిస్తున్న వాహనాలను వదిలి పారిపోతున్న క్రమంలో మునిపల్లి పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.
ఒడిస్సా నుంచి బీదర్‌కు 260 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు వరకు ఉంటుందని సమాచారం. గంజాయి తరలిస్తూ పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకోవడంతో వారిని ఉన్నత అధికారులు అభినందించారు
Kumuram Bheem | కుమ్రం భీం Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ
పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : పెందోర్ దాదిరావు
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య