మనోహరాబాద్ : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని మండల అధ్యక్షుడు పురం మహేశ్, సర్పంచ్ చింతల మమతారవి ముదిరాజ్, కొండాపూర్, రంగాయిపల్లి, ఇమాంపూర్‌లో మండల అధ్యక్షుడు బబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలను నాటి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీపీ పురం నవనీతారవి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, యూత్ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి, సర్పంచ్ నర్సయ్య, ఉప సర్పంచ్‌లు శ్రీహరిగౌడ్, మహేందర్‌గౌడ్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, భిక్షపతి, మైనార్టీ అధ్యక్షుడు జావీద్ పాల్గొన్నారు.
కాళ్లకల్, మనోహరాబాద్‌లో…
కాళ్లకల్ బంగారమ్మ దేవాలయంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళ్లకల్‌లో మొక్కలను నాటారు. మనోహరాబాద్ రైతువేదిక వద్ద రైతుబంధు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. గౌతోజిగూడెంలో ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్ మొక్కలను నాటారు.
68 కిలోల కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శ్రమనే తన ఆయుధంగా చేసుకుని రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ దేశదేశాల్లో పేరు సంపాదించారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని గూడురు గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు వారు హాజరై 68 కిలోల కేక్ కట్ చేసి మహిళలకు చీరలు, టీఫిన్ బాక్సులు, వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శివకుమార్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, కౌన్సిలర్ అశోక్‌గౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ గోవింద్‌నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ లాయక్, రాజ్యం భిక్షపతి, భీమనపల్లి మురళీ ఉన్నారు.