సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 17 : దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వమత సమానత్వం..శాంతియుత పాలన అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మానిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసా ల బుచ్చిరెడ్డి, కంది జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పెరమళ్ల నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.
చిట్కుల్ నుంచి పాదయాత్ర
పటాన్చెరు : చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తమ గ్రామం నుంచి రుద్రారం గణేష్ దేవస్థానం వరకు గురువారం పాదయాత్ర చేశారు. పటాన్చెరు మండలం రుద్రారం హనుమాన్ విగ్రహం వద్ద ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వారిని కలిసి ప్రశంసించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సిద్ధి వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నీలం మధు, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్‌చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పాండు, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్ఎంఎం యువసేన సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సంక్షేమ పథకాలు
నర్సాపూర్ : తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్‌గుప్తా, అశోక్‌గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అందోల్ క్యాంప్ కార్యాలయంలో..
అందోల్ : నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, మండల కేంద్రా ల్లో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అందోల్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కేక్ కట్ చేశారు. అందోల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బాలయ్య, ఎంపీడీవో సత్యనారాయణ కేక్ కట్ చేసి సిబ్బందికి పంచి పెట్టారు. జోగిపేటలోని సాయిబాబా ఆలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ ఉన్నారు.
దేశ అభివృద్ధిలో తెలంగాణకు మొదటి స్థానం..
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఆదర్శ ప్రాయుడని రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తూప్రాన్‌లో కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు సరాఫ్ సతీశ్‌చారి, వైస్ చైర్మ న్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్ ఉన్నారు.
దేశ రాజకీయాలను శాసించేలా ఎదగాలి..
పాపన్నపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలం లో దేశ రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదగాడానికి వనదుర్గామాత శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గాభవానీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ఏడుపాయలలో మొక్కను నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షు డు కుమ్మరి జగన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కుభేరుడు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకులు
ఝరాసంగం : ముఖ్యమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు పాలాభిషేకం, రుద్రాభిషేకం చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి ఆయనను పూలమాలతో సన్మానించారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగే మహా శివరాత్రి జాతర వాల్ ఫోస్టర్‌ను ఆవిష్కరించారు.