KCR | మునిపల్లి, జూన్ 15: కేసీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నాడో యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపాలపురం గ్రామానికి చెందిన పట్వారి మహేందర్ తన ఒంటిపై కేసీఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాడు.
తనకు చిన్నతనం నుంచి కేసీఆర్ అంటే అభిమానమని మహేందర్ చెబుతుంటాడు. కేసీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టమని ఎవరైనా అడిగితే అతను ఇచ్చే సమాధానం ఒక్కటే.. తనకు కేసీఆర్ దేవుడితో సమానమని చెబుతుంటాడు. కనిపించని దేవుళ్ల కంటే.. కేసీఆర్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని అంటాడు. ఒక్కసారైనా కేసీఆర్ సార్ను కలవాలన్నది తన కోరిక అని మహేందర్ చెప్పాడు. కేసీఆర్తో పాటు కేటీఆర్ అంటే కూడా తనకు ఎంతో అభిమానమని మహేందర్ తెలిపాడు. అందుకే తన మెడపై కేటీఆర్ పేరును సైతం పచ్చబొట్టు వేయించుకున్నాడు.