Pyaranagar Waste Unit | గుమ్మడిదల, మార్చి 29 : ప్యారానగర్ డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)కు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా..? అని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామాల్లో డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఇవాళ గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో అనంతారం రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. రైతు, మహిళా జేఏసీ నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, దోమడుగు బాల్‌రెడ్డి దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్యారానగర్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌యార్డు వల్ల వాతావరణం, భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల రైతులు సాగు చేసే పంట పొలాలు పూర్తిగా కలుషితమై పంటలు పండక ఉపాధి కోల్పోతారని అన్నారు. వాతావరణం కలుషితం కావడం వల్ల ఇక్కడి ప్రజలు రకరకాల రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు వల్ల అన్ని దుష్పరిణామాలే ఎదురైతాయన్నారు. ఇలాంటి డంపింగ్‌యార్డు ఇక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు పీ. వీరారెడ్డి, ఊట్ల యాదిరెడ్డి, గోసుకొండ సాయిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విప్ప కరుణాకర్‌రెడ్డి, పోచుగారి మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, మన్నె రామకృష్ణ, కొరివి సురేశ్, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.