గుమ్మడిదల, మే11: ప్యారానగర్ డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో రైతు జేఏసీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేస్తునే ఉన్నారు. మండలంలోని నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో జీహెచ్ఎంసీచే ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)ను వెంటనే రద్దు చేయాలని కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారానికి 96వ రోజుకు చేరుకున్నాయి. రైతు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జై జవాన్- జైకిసాన్ అంటూనినాదాలు చేశారు. గత నెలలలో ఎంఎస్డబ్ల్యూపై అభ్యంతరాలను వెల్లడించాలని జిల్లా యంత్రాంగం సూచించడం వల్ల తహసిల్దార్ కార్యాలయంలో నల్లవల్లి, ప్యారానగర్, కొత్తపల్లి గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు డంపింగ్‌యార్డును రద్దు చేయాలని అర్జీలు తహసిల్ధార్‌కు అందజేసినప్పటికి ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేకపోవడం సరైనది కాదని విమర్శించారు. వెంటనే ఇక్కడి గ్రామాల ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఎస్డబ్ల్యూను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.