గుమ్మడిదల, మే2: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్(Pyaranagar) సమీపంలో జీహెచ్ఎంసీచే ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డును (ఎంఎస్‌డబ్ల్యూ)ను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో చేస్తున్న రిలేనిరాహారదీక్షలు 87వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 87 రోజులుగా పనులు మానేసి డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుదలకు పోయి ప్రజాపాలనను భ్రష్టుపట్టించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుకు సూచించారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రజాపాలనతో సీఎం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కారు, గుమ్మడిదల మండల ప్రజల క్షేమం కూడా చూడాలని సూచించారు. ఇకనైనా డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.