జిన్నారం, మే 23 : ఆర్రుద కార్తి పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆర్రుద పురుగులు. వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురవగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. అయితే ఈసారి కొద్దిగా ముందే వచ్చేశాయి. గత వారం రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పుల కారణంగా ఉష్ణ్రోగతలు తగ్గి వర్షాలు కురుస్తుండడంతో చల్లటి వాతావరణానికి ఆర్రుద పురుగులు దర్శనమిచ్చాయి.
మామూలుగా ఇవి కనిపిస్తే వర్షాలు పుష్కలంగా కురుస్తాయని రైతుల నమ్మకం. ఈ క్రమంల జిన్నారం మండల కేంద్రంలో తొలకరి వర్షం పలకరింపులతోనే అందమైన ఎర్రటి ఆర్రుద పురుగులు నేలపై కనిపించి అలరించాయి. ఆర్రుద కార్తె రాకముందే పంట పొలాల్లో కనిపించడం శుభసూచకమని రైతులు చెబుతున్నారు. 20 రోజుల ముందే కనిపించడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని ఇవి పంటలకు మిత్ర పురుగులని మండల రైతులు సంతోషంగా చెబుతున్నారు.