Raikode | ఝరాసంగం, ఆగస్టు 24; విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిపై ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతు మాటలు తిట్టిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతురి సుధాకర్ రెడ్డిపై ఝరాసంగం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం శని అమావాస్య సందర్బంగా మండలంలోని బర్దిపూర్ ఆశ్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన సందర్బంగా పోలీస్ బందోబస్తు నిరహిస్తున్న ఓ పోలీస్ అధికారి రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను లోపలికి అనుమతి లేదు అంటూ చెప్పి వాహనాన్ని అనుమతించలేదు. దీంతో చైర్మన్ ఉగ్ర రూపంతో రెచ్చిపోయి నువ్వు పోలీస్ ఐతే నాకేంటి బే అంటూ బూతులు తిట్టి పోలీస్ అధికారిపైకి తన వాహనాన్ని తీసుకెళ్లడంతో పోలీస్ అధికారి పక్కకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉండగా బందోబస్తు అనంతరం పోలీస్ అధికారి వద్దకు వెళ్లి ఏంట్రా ఎక్సట్రాలు చేస్తున్నావ్ యూనిఫామ్ ఉందని నీ ఓవరాక్షన్.. ఉద్యోగం పీకేపిస్త కొడుకా అంటూ మరోసారి రెచ్చిపోయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పై ఝరాసంగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌పై ఝరాసంగం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహించే పోలీసులను ఇష్టం వచ్చినట్టు బూత్ మాటలు తిట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?