పటాన్చెరు, డిసెంబర్ 13 : యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలోని బీ స్ట్రాంగ్ జిమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిమ్ నిర్వాహకులు ఉమర్ జిమ్‌లో ఉన్న అధునాతన ఇక్యుప్మెంట్లను ఎమ్మెల్యేకు, నాయకులకు చూపించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల పరిధిలో అధునాతన జిమ్‌లు ప్రారంభం కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనం అన్నారు. కరోనా వైరస్లు, ఇతర వ్యాధులు పెరిగిపోతున్న వేళ వ్యాయమాలు ఇమ్యూనిటిని పెంచుతాయన్నారు. యువత ఫిట్‌నెస్‌వైపు మొగ్గు చూపాలని కోరారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉండకుండా స్వయం ఉపాధి కల్పించుకోవడం అభినందనీయమన్నారు. ఒమర్ వంటి మంచి బాడిబిల్డర్లు ఇక్కడి యువతను బాడిబిల్డింగ్లో శిక్షణ ఇచ్చేందుకు రావడంపై అభినందించారు.
కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, చిట్కుల్ సర్పంచ్ నీలం మధుముదిరాజ్, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్, అమీన్‌ఫూర్ కో ఆప్షన్ సభ్యుడు యూనుస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వెంకట్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, ముత్తంగి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామక్రిష్ణముదిరాజ్, రవికుమార్, రజాక్, తదితరులు పాల్గొన్నారు.