జహీరాబాద్, అక్టోబర్ 24 : తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని న్యాల్కల్ మండలం రాజుల గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద గల పేకాట స్థావరంపై హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నమ్మదగ్గ సమాచారం మేరకు గురువారం రాత్రి హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ ఆధ్వర్యంలో పోలీసులు రాజుల గ్రామ సమీపంలో జర్నప్ప వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో కర్ణాటక -తెలంగాణ ప్రాంతాలకు చెందిన 11మంది జూదరులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే వారి పేర్లను గొప్పంగా ఉంచుతామని వారు పేర్కొన్నారు.