Economical literacy | జహీరాబాద్, ఫిబ్రవరి 12 : ప్రతి ఒక్కరికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని న్యాల్కల్ మండలంలోని హద్నూర్ కెనరా బ్యాంక్ మేనేజర్ తుల్జారాం సూచించారు. గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం కష్టపడి సంపాదించిన వాటికి విలువ, గుర్తింపు ఆర్థిక అక్షరాస్యతతోనే సాధ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలను ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహనను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల పథకాలు, రుణాలు, బీమా సదుపాయాలను వివరించారు. యువత, మహిళలు, రైతులు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా లభించే జన సురక్ష, పీఎం విశ్వకర్మ యోజన, ముద్ర, పీఎంఈజీపీ , పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన లాంటి రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జీవన విధానంలో పొదుపు అనేది ఎంతో ముఖ్యమైందని.. పొదుపును అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ షబ్బీర్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి ధనరాజ్, బ్యాంకు అధికారులు ప్రశాంత్, వార్డు సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
BRS | రాజేంద్ర నగర్‌ను హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన
Attack | ప్రభుత్వ టీచర్‌పై కత్తితో దాడి.. నగల అపహరణ