పటాన్చెరు, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చూసిన ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్బలంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది చల్లో వరంగల్ ఫ్లెక్సీలు తొలగించారని పటాన్చెరు బీఆర్ఎస్ ఇంచార్జీ ఆదర్శరెడ్డి ఆరోపించారు. శనివారం పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ సర్కిల్లో సమీపంలో ఏర్పాటు చేసిన ఛల్లో వరంగల్ ఫ్లెక్సీలు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో తొలగించారని తెలిపారు. వరంగల్ సభకు ఎక్కడ చూసిన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు మందుకు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి ఓర్వలేక దాడులు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గులాబీ నేతలు ప్రశ్నించినా, నిరసన తెలిపినా, ప్రజల తరపున నిలబడిన కేసులు నమోదు చేస్తున్నారని ఆదర్శ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరం చేయడంలో విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యాలను ప్రశ్నించినా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. పటాన్చెరులో రాత్రి ఒంటి గంటకు ఫ్లెక్సీలు చించి తొలగించిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు వరంగల్ సభకు వెళ్లకుండా భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గిన గుణపాఠం చెపుతారని తెలిపారు. కేసీఆర్ను మరో సారి సీఎంను చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు.