నిజాంపేట్, మే 10: ప్రత్యేక అధికారుల నియమకంతో గ్రామాల్లో పాలన పట్టుతప్పింది. నిధుల లేమితో నిర్వహణ లోపించడం వల్ల పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) కలహినంగా మారాయి. మారుమూల గ్రామాలలో విద్యార్థులు, యువకులు, వృద్ధులకు ఆటవిడుపుతోటు ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగ ప్రతి గ్రామ పంచాయతీకి రూ.3 లక్షల వ్యయంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఈ పల్లే ప్రకృతి వనాలలో నీడను, పూలనిచ్చే మొక్కలను నాటారు. వృద్ధులు కాలి నడకన నడిచెందుకు కాలి బాటను,సేద తీరెందుకు కుర్చిలను సైతం ఏర్పాటు చేశారు.
పాలకవర్గాల గడువు ముగియడంతో
పంచాయతీ పాలక వర్గల కాలపరిమితి లేకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించిన కాంగ్రెస్ సర్కారు వారికి భాధ్యతలను అప్పగించింది. దీంతో పంచాయతీలకు నిధుల కోరత ఏర్పడింది. దీంతో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ భారంగా మారింది. దీనికితోడు గ్రామాలలో భుగర్భజలాలు అడుగంటడంతో నీటి సమస్య ఏర్పడింది. దీతో పల్లె ప్రకృతివనాలకు నీటి సరఫర నిలిచి పోయింది. పచ్చగా కలకలలాడె పల్లె ప్రకృతి వనాలు నేడు ఎండిపోయి మోడుబారినట్లు కనిపిస్తున్నాయి. నిజాంపేట మండలంతో పాటు అన్ని పంచాయతీలలో ఏర్పాటు చెసిన పల్లె ప్రకృతి వనాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన అధికారులు స్పందించి పల్లెప్రకృతి వనాలలో ఎండిపోతున్న చెట్లకు నీరు అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.