Anganwadi Centre | నిజాంపేట్, సెప్టెంబర్ 14 : చిన్నారులు విద్యాబుద్దులు నేర్చుకునే ముందు వేసే తొలి అడుగు అంగన్వాడీ కేంద్రానికే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి అంగన్ వాడీ సెంటర్‌కు చిన్నారులు చాలా ఆసక్తిగా వెళ్లారు. కానీ అక్కడ మాత్రం టీచర్ లేరు. శాఖాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కనిపించిందీ దృశ్యం.
అంగన్వాడీ విద్యార్థులు మా టీచర్ ఎప్పుడొస్తదో అని ఎదురుచూస్తున్నారు. ఇక్కడ అంగన్వాడి సెంటర్ ఉన్నప్పటికీ టీచర్ లేదు.. ఆయా కూడా లేదు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టీచరు బదిలీపై వెళ్లడంతో అంగన్వాడి సెంటర్లో టీచర్ పోస్టు ఖాళీ అయింది. అందులో గతం నుండి ఆయా పోస్ట్ అయితే ఖాళీగానే ఉంది. అది అలా ఉన్నప్పటికీ టీచర్ కూడా బదిలీపై వెళ్లడంతో రోజు విద్యార్థులు వచ్చి కూర్చొని వెళ్లిపోతున్నారు. కానీ వారికి విద్యాబుద్ధులు నేర్పేవారు కరువయ్యారు అని అంటున్నారు.
గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు. ఉన్నత అధికారులు ఈ అంగన్వాడి సెంటర్‌పై దృష్టి సారించి టీచర్‌ను, ఆయాను నియమించాలని శాఖాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థుల అక్షరాభ్యాసం మొదలయ్యేది అంగన్ వాడీ కేంద్రం నుంచే అని తెలిసినా కానీ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో పై ఫొటో ద్వారా తెలిసిపోతుంది.
Koppula Eshwar | కర్ర శ్రీహరికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Rayapole | ‘తాపీ కార్మిక సంఘం లేకపోవడంతో కార్మికులకు అనేక ఇబ్బందులు’
Nizampet | యూరియా కోసం బారులు తీరిన రైతులు