Pyaranagar dumping yard | గుమ్మడిదల, ఏప్రిల్ 17 : ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలతో రాష్ట్రప్రభుత్వంలో చలనమెందుకు వస్తలేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న డంపింగ్‌యార్డ్ (ఎంఎస్‌డబ్ల్యూ)పై మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకంగా రిలే నిరాహారదీక్షలు 76వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. నల్లవల్లి, కొత్తపల్లి సమీపంలోని గ్రామాల రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నారన్నారు. ఈ డంపింగ్‌యార్డు వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం కాలుష్యమయంగా మారుతుందని.. తద్వారా రైతులు పంటలు పండిచలేరన్నారు.
డంపింగ్‌యార్డు వ్యర్థాల వల్ల అడవితోపాటు వానకాలంలో వచ్చే వానల వల్ల దిగువ ప్రాంతమైన నర్సాపూర్ రాయచెరువు పూర్తిగా జలకాలుష్యంగా మారుతుందన్నారు. దీనికి గొలుసుకట్టుగా ఉన్న 20 గ్రామాల్లోని చెరువులు కూడా కలుషితమై ప్రజాజీవనానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.
ఇక్కడి గ్రామాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డుకు ఇచ్చిన అనుమతులు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల జేఏసీ నాయకులు కుమ్మరి ఆంజనేయులు, మన్నె రామకృష్ణ, కొరివి సురేశ్, మహిళా జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం