Kalyana lakshmi | మునిపల్లి, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ పార్టీ వాళ్లమనే కళ్యాణ లక్ష్మిచెక్కులు ఇవ్వలేదా అనే శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ వచ్చిన కథనానికి మునిపల్లి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇవాళ మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్దిదారుల ఇంటికి వద్దకు నేరుగా వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. మంగళవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని మమ్మల్ని మునిపల్లికి పిలిపించి చెక్కులు ఇవ్వకుండానే ఇంటికి పంపించినట్లు తెలిపారు. చెక్కులు ఇవ్వలేదన్న అవేదనతో మునిపల్లి నమస్తే తెలంగాణ విలేకరికి ఫోన్ చేసి వారి సమస్యలను నమస్తే తెలంగాణ దృష్టికి తీసుకువచ్చారు.
అందుకు అధికారులు స్పందించి మా ఇంటి వద్దకు వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం సంతోషంగా ఉంది. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతున్న నమస్తే తెలంగాణకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఎంత తిరిగినా రాని చెక్కులు ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్