Upaadi Coolies | ఝరాసంగం, జూలై 9 : వ్యవసాయ కూలీలకు ఏడాదికి కనీసం 200 పని దినాలు, రోజుకు రూ.600 కూలి కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎల్గోయి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు బి రాంచందర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేస్తేనే కూలీలకు స్థిరమైన ఆదాయం, జీవన భద్రత లభిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్జ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం ఇప్పటికీ కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పక్షాన లేవని, రైతులు–కూలీల ప్రయోజనాల కోసం ఎర్రజెండా ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుల్జారం, లక్ష్మన్, పవన్, శంకర్, తులజమ్మ, నర్సింహులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం