Wakf Amendment Bill | కొండాపూర్, మార్చి 31 : మండల పరిధిలోని అనంతసాగర్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు సోమవారం రంజాన్ పండగ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా, అన్యాయంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకువచ్చి.. జేపీసీ కమిటి పేరుతో డ్రామాలాడుతోందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు.
రంజాన్ పండుగ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ పిలుపు మేరకు గ్రామంలోని నడి బొడ్డున ఈద్గాలో ప్రార్థనల అనంతరం నల్ల రిబ్బన్లు ధరించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతియతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో వక్ఫ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర చేస్తుందని, ఇది హేయమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లులు ఉపసంహరించకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ కో-అప్షన్ సభ్యులు అమినోద్దీన్, ముస్లీం పెద్దలు వహీద్, జలీల్, జాకీర్, అజీంపాష, మోహిన్, మహముద్, చాంద్పాష, ఆయాజ్ తదితరులు పాల్గొన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం