MP Raghunandanrao| రామచంద్రాపురం,సెప్టెంబర్ 16 : బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్‌కు రూ.100 కోట్లతో డైరెక్టుగా రోడ్డు కనెక్టివిటీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కోరడం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమిషనర్ కర్ణన్ కి వివరించారు.
నాలాకు అనుకోని ఉన్న ఎంక్రోచ్మెంట్స్ను తొలగించి నాలాపై నుంచి రోడ్డును వేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని, దీని ద్వారా వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని కమిషనర్‌కు ఆయన వివరించారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. రోడ్డు కనెక్టివిటీ కోసం గతంలో జీ హెచ్ ఎం సి కౌన్సిల్ సమావేశంలో ప్రస్థావించడం జరిగిందన్నారు. గత నెల రోజుల నుంచి ప్రతీ రోజు మానిటర్ చేయడంతో కమిషనర్ కర్ణన్ డైరెక్ట్‌గా ఫీల్డ్ విజిట్‌కు రావడం జరిగిందని తెలిపారు. రూ.100 కోట్లుతో వంద రోజుల వ్యవధిలో రోడ్డు పనులు మొదలుపెట్టాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమం చేప్పడ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింగ్ గౌడ్, ఈర్ల రాజు, ఎడ్ల రమేశ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్‌హౌస్’ ఓఎస్టీ విడుదల