Gas Leak | ఝరాసంగం, ఆగస్టు 18 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఒక కుటుంబాన్ని కుదిపేసింది. పక్షం రోజులు గడవకముందే పది రోజుల్లోనే తల్లితోపాటు ఇద్దరు కుమారులను కోల్పోవడంతో గ్రామం అంతా శోకసంద్రంగా మారింది. ఈ నెల 6న గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో శంకరమ్మ (65), ఆమె కుమారులు ప్రభు (38), విట్టల్ (30)లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించారు.
గాయాల తీవ్రతను తట్టుకోలేక శంకరమ్మ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 8న మృతి చెందారు. తల్లి మరణం మరువక ముందే పెద్ద కుమారుడు ప్రభు ఈ నెల 15న ప్రాణాలు కోల్పోయాడు. అన్న దినకర్మ నాడు తమ్ముడు విట్టల్ కూడా పటాన్చెరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. ఒక్క కుటుంబంలో తల్లి, ఇద్దరు కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి బక్కన్న తలకొరివి పెట్టాల్సిన దుస్థితి ఎదురైంది.
భార్య, ఇద్దరు కుమారుల మృతదేహాల ముందు పుత్రశోకంతో బక్కన్న విలపించడం చూసి గ్రామస్థుల కళ్లలో నీరంతా ఆగలేదు. ఒకే కుటుంబం మూడు ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
Kodangal | అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడుబండిలో తరలించిన పోలీసులు.. సీఎం ఇలాకాలో అమానవీయం
Tadipatri | జేసీ ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డిని అడ్డుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Thorrur | యూరియా కోసం రైతుల బారులు.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైన కష్టాలు