జిన్నారం, డిసెంబర్ 29 : పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం కొడకంచి గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో చేపట్టిన మాస్ ప్లాంటేషన్ లో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వివిధ పథకాలను చేపట్టారని అన్నారు. గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేయడమే కాకుండా పల్లె పకృతి వనాలను ఏర్పాటు చేశారన్నారు. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, చెరువు కట్టలకు మొక్కలను నాటినట్లు తెలిపారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
నాటిన ప్రతి మొక్కను రక్షించాలని చెట్లను కాపాడాలని అందరికీ సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ జనార్దన్, అజంనేయులు, శివరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.