జహీరాబాద్ , ఆగస్టు 28 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో వర్షాల కారణంగా నిండు కుండలా మారిన కొత్తూరు(బి) గ్రామ శివారులోని నారింజ ప్రాజెక్టును ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నారింజ వాగు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి ప్రవాహం, కెపాసిటీ, విడుదల పరిస్థితులు, భద్రతా చర్యలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 7400 క్యూసెక్కుల వరదనీటి రాగా ప్రాజెక్టు నుంచి దిగివకు 7300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. నారింజ ప్రాజెక్టులో నుంచి దిగువకు వదిలిపెడుతున్న వరదనీటితో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.