MLA Gudem Mahipal Reddy | పటాన్ చెరు, నవంబర్ 20 : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
30 వేల మంది విద్యార్థులు ఒకే సమయాన సామూహిక గీతాలాపన చేసేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Karnataka | కర్నాటకలో ‘నవంబర్ రెవల్యూషన్’.. ఢిల్లీలో శివకుమార్ క్యాంప్ ఎమ్మెల్యేల లాబీయింగ్..!
IDEAL Foundation | విద్యా సంస్థల అభివృద్ధికి ఐడీయల్ సంస్థ రూ. 10 లక్షలు వితరణ
Ramavaram : క్రీడా పోటీల నిర్వహణలో లోటు లేకుండా చూడాలి : జీఎం శాలెం రాజు