పటాన్ చెరు, జూన్ 29 : రానున్న ఆషాఢ మాస బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆషాఢ మాసం బోనాల తేదీల ఖరారు, నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొన్నారు. వేద పండితులు, కుల సంఘాల నాయకులతో చర్చించి 21 జులై 2025 సోమవారం పటాన్ చెరులో బోనాల పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండగకు ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పదని, గ్రామ దేవతలను ఆరాధిస్తూ జరిపే ఈ పండగ సందర్భంగా డివిజన్ పరిధిలోని కాలనీలలో ఉన్న గ్రామ దేవతల ఆలయాలకు వేలాది మంది భక్తులు వస్తారు. జీహెచ్ఎంసీ తరపున పారిశుధ్య, విద్యుత్ దీపాలు ఇతర అన్ని ఏర్పాట్లు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.