సదాశివపేట, మే 1 : దేశ సంపదను సృష్టించేది కార్మికుల రెక్కల కష్టమేనని, కార్మికుల త్యాగాలు అమూల్యమైనవని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా సివిల్ సప్లయ్ గోదాం వద్ద హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే బాబు మియా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
హమాలీ కార్మికుల కష్టాలు ఎంతో విలువైనవని తెలిపారు.
ఉత్పత్తి రంగంలో కార్మికులు భాగం పంచుకుని దేశ సంపదను సృష్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు మియా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్, నాయకులు కొత్తగొల్ల కృష్ణ, నాగుల విజయ్‌కుమార్, కార్మికులు ఎస్కే ఖుర్షిద్ పాషా, ప్రభు, యేసురత్నం, ఎండీ వాహెద్, ఎస్కే పాషా మియా, వెంకటేశ, ఔసాద్ పాషా తదితరులు పాల్గొన్నారు.