న్యూఢిల్లీ: తమిళనాట కొందరు రాజకీయ నాయకులు ఇంకా పాత పద్ధతులనే అనుసరిసున్నారని.. వారి కి ఓటర్లు బోధించిన, కోరుకుంటున్న మార్పు అర్థం కావడం లేదని రాష్ట్ర రాజకీయ నాయకుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఇండియా టుడే గ్రూప్ తమిళనాడు రౌండ్ టేబుల్ కార్యక్రమంలో సోమవారం ఆయన రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. విజయ్ ప్రభుత్వం వంద రోజుల పాలనను ఆయన స్వాగతించారు. నిందించడం, ఓ మహిళను, ఓ తల్లిని రాజకీయాల్లోకి లాగడం పాత పద్ధతులనే కొందరు ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో వాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఇటీవల ఉదయనిధి స్టాలిన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలు, సీఎం విజయ్‌కు నటి త్రిషతో ఉన్న స్నేహం గురించే ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేసినట్టు అనిపించింది. తనను బీజేపీ బీ టీమ్‌గా పేర్కొనడంపై స్పందిస్తూ రాష్ట్రంలో ఎవరైనా కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తే వారిపై ఇలా ముద్ర వేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు.