న్యూఢిల్లీ: ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు పంచాయతీ’ జరుగనున్నది. కాగా ఆదివారం ఢిల్లీ మార్చ్‌కు బయలుదేరిన వందలాది మంది రైతులను పంజాబ్ వైపున గల ఖానౌరీ సరిహద్ద వద్ద జింద్ పోలీసులు అడ్డుకున్నారు. బారికేడింగ్‌తో ఆ మార్గాన్ని సీల్ చేశారు. జగ్జీత్ దల్లేవాల్ హర్యానా- పంజాబ్ సరిహద్దులోని దాతాసింగ్ వాలా గ్రామం నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వరకు ‘కిసాన్ బచావో పాదయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇది ఆగస్టు 29న రాజధానిలో ‘రైతు పంచాయతీ’తో ముగుస్తుందని తెలియజేశారు. క్రిసాన్ మోర్చా ప్రతినిధులకు హర్యానా అధికారులకు మధ్య జరిగిన మూడు రౌండ్ల చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.