లఖిసరాయ్: బీజేపీ పాలిత బీహార్లోని లఖిసరాయ్ జిల్లా అశోక్ ధామ్ గుడి వద్ద సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గుడికి దగ్గరలో ఉన్న అశోక్ ధామ్ హాల్ట్ రైల్వే స్టేషన్ వద్ద భారీ రద్దీ వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. పవిత్ర శ్రావణ మాసంలో శివుడికి జలాభిషేకం చేసేందుకు యాత్రికులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన సంభవించినట్టు అధికారులు తెలిపారు. ‘భక్తులు పోటెత్తడంతో కొన్ని బారికేడ్లు కూలిపోయి ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు’ అని జిల్లా మెజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు.
ఉజ్జయిని ఆలయంలో 13 మందికి అస్వస్థత
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గల నాగచంద్రేశ్వర ఆలయానికి మూడో శ్రావణ సోమవారం సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో బారికేడ్ల వద్ద గందరగోళం, ఒత్తిడి ఏర్పడింది. దీంతో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే దవాఖానకు తరలించారు. ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెరుస్తారు.