పటాన్చెరు, అక్టోబర్ 15 : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలి అని పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం పటాన్ చెరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అబ్దుల్ కలాం విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. సొంత టెక్నాలజీతో మిస్సైల్స్ కనిపెట్టి భారత అమ్ములపొదిలో అగ్ని, బ్రహ్మోస్ వంటి అత్యంత శక్తివంతమైన క్షిపణులను అందజేసి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన గొప్ప ఙ్ఞానవంతుడు కలాం అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, బండ్లగూడ టౌన్ ప్రెసిడెంట్ భరత్, గూడెం మధుసూదన్ రెడ్డి , శంకరయ్య , పోచారం కృష్ణయ్య , వంగరి అశోక్, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, గొల్ల కృష్ణ యాదవ్, మెట్టు ఎల్లేష్ యాదవ్,శ్యామ్ , పృథ్వీరాజ్, కార్ రాజు ,అజ్మత్ అజ్జు, మెట్టు కళ్యాణ్ యాదవ్, అఫ్జల్, నరేష్ , వడ్డేపల్లి ప్రభు,జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ స్పందన చౌదరి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ,ప్రభుత్వ పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.