సదాశివపేటలో దారుణం..
సదాశివపేట| జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్‌కు

సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు తాగించిన తండ్రి.. తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్‌కు, అల్లాదుర్గం గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కూతుర్లు సిరి, నవ్యశ్రీ (4) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా.. శివకుమార్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటున్నది. కాగా, నిన్న సాయంత్రం అల్లాదుర్గం వెళ్లిన శివకుమార్ తన ఇద్దరు కూతుర్లను సదాశివపేటకు తీసుకువచ్చాడు. రాత్రి ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అయితే వారిని పరిశీలించిన డాక్టర్లు చిన్న కుమార్తె నవ్యశ్రీ అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. శివకుమార్, పెద్ద కుమార్తె సిరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శివకుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, శివకుమార్ సూసైడ్ నోట్ రాసినట్లుగా తెలుస్తున్నది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి అత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేత
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
పాకిస్థాన్‌కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
కొజికోడ్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్..
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 1.31లక్షల కేసులు
మద్యం మత్తు, ఆపై అతివేగం.. లంగర్‌హౌస్‌లో డివైడర్‌ను ఢీకొన్న కారు
మాల్దీవుల్లో బికీనీతో రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్
భర్తను బహిష్కరించిన బీజేపీ.. భార్యకు మాత్రం టికెట్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

