మునిపల్లి, డిసెంబర్ 05 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మునిపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్ )అన్నారు. శుక్రవారం మండలంలోని లింగంపల్లిలో స్థానిక విలేకర్లతో సమావేశం నిరహించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మాట్లాడుతూ మునిపల్లి మండలం లింగంపల్లిలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక చొరవతో లింగంపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
లింగంపల్లి గ్రామానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేసిన ఘనత రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నరు. గత పది ఏండ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ అభివృద్ధి చెందిన దాఖలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను అడ్డం పెట్టుకొని ఇందిరమ్మ చీరల పేరుతో నాసిరకమైన చీరలను పంపిణీ చేసి ప్రజల్లో మరోసారి నమ్మకం పోగొట్టుకున్నారని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో తాగిన బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్సర్, సీనియర్ నాయకులు కురిసిత్, బక్కన్న, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.