గుమ్మడిదల, మే1: ప్యారానగర్ డంపింగ్‌యార్డును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారానికి 86వ రోజుకు చేరాయి. మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో ఏర్పాటు కాబోతున్న డంపింగ్‌యార్డు(ఎంఎస్‌డబ్ల్యూ)ను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 86 రోజులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్డబ్ల్యూపై స్పందించే వరకు దీక్షలు కొనసాగుతాయని హెచ్చరిం చారు. ఈకార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.