సంగారెడ్డి: జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వెలిమెల తండాకు చెందిన రాజు నాయక్‌ను దుండగులు హత్య చేసి అతడి తల, మొండెం వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రాజు నాయక్ హత్యతో సంబంధముందని అనుమానిస్తూ ఆరుగురు నిందితులు రాంసింగ్, రమేశ్, విష్ణు, వెంకటేశ్, మల్లేష్, బాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విచారిస్తున్నారు. భూవివాదంతోనే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.