కొండాపూర్, జూన్ 26: కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్‌లో.. మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో విపరీతంగా మట్టి తొవ్వుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలే ఇందుకు నిదర్శనంగా ఉంది. కొండాపూర్ మండలంలో అయితే ఏకంగా తహశీల్దార్ కార్యలయం ముందు నుంచే పదుల సంఖ్యలో పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా అక్రమంగా మట్టిని ఎత్తుకెళ్లుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే యధేచ్చగా అక్రమంగా మట్టిని తీసుకుపోవడం గమనర్హం. అయితే ఈ నెల 21 వ తేదీన కొండాపూర్ గ్రామానికి చెందిన కొందరు ప్రజలు తహశీల్దార్‌కు అక్రమంగా చెరకువులో మట్టిని తరలిస్తున్నారని ఏకంగా రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు.
అధికారుల తీరుపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కొండాపూర్ చెరువులో నుంచి నల్ల మట్టిని అక్రమంగా తరలించడాన్ని గ్రామస్తులు తప్పుపట్టిన ఎవ్వరు పట్టించుకోవడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి కొండాపూర్ మండంలం నుంచి వేరే మండలానికి అక్రమంగా ఇటుక బట్టిలకు, వెంచర్లకు మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఎలాగైన అక్రమంగా తరలిస్తున్న మట్టిని అధికాలు ఎలాగైనా ఆపివేయాలని కోరిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే కొండాపూర్ మండంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో కూడా అక్రమంగా నల్ల మట్టిని కొందరు నాయకులు యదేచ్చగా తరలిస్తున్నారు.
అధికార పార్టీ నాయకుల అండదండలతోనే..
పట్ట పగలు.. మిట్ట మధ్యాహ్నం.. యధేచ్చగా అక్రమంగా మట్టిని తరలించిన ఎవ్వరు ఏమనకపోవడంపై గ్రామంలో తీవ్రంగా విమర్శల చేస్తున్నారు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే తహసీల్ధార్ కార్యలయం ముందు నేంచి నల్ల మట్టిని పెద్ద పెద్ద లారీలలో తరలించడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఒక ట్రాక్టర్ మట్టిని ఎవరైన గ్రామలస్తల తీసుకెళ్లితే వెంటనే ఫిర్యాదులు వవచ్చాయి మట్టిని తరలిండం ఆపెయాలంటూ అధికారులు హుకుం జారీచేసి ఆ పనులను వెంటనే ఆపి వేస్తారు. కాని ఇంత పెద్ద ఎత్తున అక్రమంమగా మట్టి తవ్వకాలు జరిగిన అధికారులు మాత్రం అధికార పార్టీ నాయకులను ఏమి చేయలేకపోతున్నారు. మల్కాపూర్ చురువులో నుంచి అధికారన్ని అడ్డపెట్టుకుని కొంత మంది వ్యక్తులు అక్రమ తోలకాలకు తెరలేపారి గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న రెవెన్యూ యంత్రంగం పట్టించుకోవడం లేదని కొండాపూర్, మల్కాపూర్ గ్రామల ప్రజలు తెలపుతున్నారు. అధికారులు అవినీతి పనులపై కనీస అటవైపు కన్నెత్కిత చూడక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ అనుమతులు పొంది మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వంలో అధికారుల అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు రేయింభవళ్లు జోరుగా సాగుతున్నా…రెదెన్యూ, పోలీస్ శాఖలు పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తలే ఆరోపిస్తున్నారు.
మట్టి తవ్వకాలు నిలిపివేయాలి
ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కొండాపురానికి చెందిన టి రాములు అన్నారు. చెరువుల నుంచి మట్టిని తీసి ఇతర గ్రామాలకు ఆయా అవసరాలకు అమ్ముకుంటున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొండాపూర్ తహశీల్దార్‌కు అక్రమంగా తరలిస్తున్న మట్టిని ఆపివేయాలని స్వయంగా ఫిర్యాదు చేసిన ఆయన కూడా పట్టించుకోవడం లేదు. వెంటే ముందుగా అక్రమంగా తరలిస్తున్న మట్టి తవ్వకాలు ఆపివేయాలి.
అధికారులు పట్టించుకోవడం లేదు
గ్రామాల్లో మట్టి తవ్వకాలు చేపట్టారు. అయిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మల్కాపూర్‌కు చెందిన అనిల్ అన్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నరని ఆరోపణలు చేసిన, ఫిర్యాదులు కూడా చేసిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకోని ఆ పనులను ఆపేయాలని కోరుతున్నా.